పవర్ స్టార్ కొత్త సినిమా క్రేజీ అప్ డేట్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి, సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది. ట్వీట్ చేస్తూ.. ‘అవును.. అప్ డేట్ రాబోతుంది. సెప్టెంబర్ 2వ తేది సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా డిటైల్స్ రాబోతున్నాయి’ అంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.

కాగా ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. కరోనా ప్రభావం తగ్గాక ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలవుతుంది.

ఇక క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

Exit mobile version