‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు పెంచేసిన హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలకు డేట్స్ కేటాయిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ముగించుకున్న పవన్, తాజాగా ఓజి చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక దీంతో అభిమానుల సంతోషం రెట్టింపు అయ్యింది. అయితే, ఇప్పుడు అందరి చూపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పడింది.

దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందుతోంది. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను పవన్ త్వరలోనే తిరిగి స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ అంచనాలు పెంచేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ నుంచి బెస్ట్ చిత్రాన్ని అభిమానులకు అందించేందుకు తమ యూనిట్ ప్రయత్నిస్తుందని.. ఆయన నుంచి ఉత్తమ చిత్రాన్ని అందించేందుకు తాము మరింత కృషి చేస్తున్నట్లు హరీష్ శంకర్ తాజాగా కామెంట్ చేశారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version