హరీష్ శంకర్ వెంట నిర్మాతల పరుగు

హరీష్ శంకర్ వెంట నిర్మాతల పరుగు

Published on May 19, 2012 11:14 PM IST


ఇటీవలే గబ్బర్ సింగ్ వంటి భారీ విజయం హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం హాట్ ప్రాపర్టీ లాగా మారిపోయాడు. రవితేజతో తీసిన మొదటి చిత్రం ‘షాక్’ నిరాశ పరిచినప్పటికీ ఆ తరువాత హరీష్ మీదున నమ్మకంతో రవితేజ ‘మిరపకాయ్’ చేయడానికి ఒప్పుకున్నాడు. తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిరపకాయ్ చిత్రాన్ని సూపర్ హిట్ చేసి చూపించాడు. ఈ సినిమాలో హరీష్ శంకర్ రాసిన డైలాగులు బాగా ఫేమస్ అయ్యాయి. మిరపకాయ్ విజయంతో గబ్బర్ సింగ్ ఛాన్స్ దక్కించుకున్న హరీష్ , పవన్ కళ్యాణ్ లోని ఎనర్జీని వాడుకుంటూ మాస్ మసాల సినిమా తీసి చూపించి బ్లాక్ బస్టర్ హిట్ తీసి చూపించాడు. పవన్ కళ్యాణ్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ రెండు చిత్రాల భారీ విజయంతో నిర్మాతలు హరీష్ వెంట పరుగు తీస్తున్నారు. హరీష్ కూడా తన రేమ్యురేషణ్ అమ్మంతం పెంచినట్లు సమాచారం.

తాజా వార్తలు