‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా కోసం ఎన్.టి.ఆర్, హరీష్ శంకర్ కలిసి పనిచేసిన విషయం తెలిసినదే. ఈ సినిమాకు సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ వస్తున్నా చిత్ర బృందం మాత్రం సినిమా విజయంపై నమ్మకంగా వున్నారు
ఈ సినిమా పైన తన భావాలను ప్రకటించడానికి హరీష్ సంకోచించలేదు. “నేను ఈ సినిమాపై వస్తున్న విమర్శలను చాలా పాజిటివ్ గా తీస్కుంటాను. ఈ సినిమా ప్రేక్షకులు చాలా ఎంటర్టైన్మెంట్ ఆశించార విషయాన్ని అంగీకరిస్తాను. అది ఈ సినిమాలో లోపించింది. శృతిహాసన్ నటించిన సన్నివేశాలు బాగా వచ్చాయని, ఆడవారిని సహకరిస్తూ రాసిన సంభాషణలు అద్బుతంగా పండాయని అందరూ మెచ్చుకున్నారని తెలిపారు. నాకు అందిన, నేను అర్ధం చేసుకున్న సూచనలను బట్టి ఎన్.టి.ఆర్ తో మరో సినిమా తీస్తానని అది ఆద్యంతం కామెడి నేపధ్యంలో సాగనుందని మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని” తెలిపాడు
సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి ముఖ్యపాత్రను పోషించింది. థమన్ సంగీతదర్శకుడు. దిల్ రాజు నిర్మాత