‘హరిహర వీరమల్లు’పై నెమ్మదిగా పెరిగిపోతున్న హైప్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో తెరకెక్కించిన అవైటెడ్ పీరియాడిక్ చిత్రమే హరిహర వీరమల్లు. అయితే గత ఐదేళ్ల కితం స్టార్ట్ అయ్యిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లో పలు డేట్స్ తర్వాత విడుదలకి సిద్ధం అయ్యింది.

అయితే ఇన్ని రోజులు పవన్ అభిమానుల్లోనే కొంచెం అటు ఇటుగా ఈ సినిమా హైప్ ఉండగా ఇప్పుడు అవేమి కాదు అందరిలోనూ మంచి ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఈసారి సినిమా రావడం అనేది పక్కా అనే మాటతో పాటుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కావడంతో ఇది యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. దీనితో ఆరోజు మాత్రం వారు పెద్ద పండుగ లానే జరుపుకోనున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇలా మళ్లీ హరిహర వీరమల్లు పై హైప్ నెమ్మదిగా పెరిగిపోతూ వస్తుంది.

Exit mobile version