ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ – క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో వచ్చేందుకు దాదాపు ఐదేళ్లు తీసుకుంది.
అయితే ఆ మధ్యలో పోయిన హైప్ తీసుకొచ్చింది. సరే అక్కడ నుంచి మాత్రం మేకర్స్ ఆ మూమెంటం ని తీసుకెళ్లడంలో విఫలం అయ్యారనే కామెంట్స్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ అస్సలు కనిపించడం లేదు. కేవలం మరో వారం మాత్రమే సినిమాకి గడువు ఉంది.
ఎప్పుడో మొదటి వారంలో ట్రైలర్ వదిలి అక్కడ నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటే మినిమమ్ చప్పుడు చిత్ర యూనిట్ నుంచి కానీ నటీనటులు నుంచి కానీ లేదు. చివరి నిమిషంలో హడావుడిగా చేసుకునే ప్రమోషన్స్ వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు.
దీనితో ఉన్న ఛాన్స్ ని కూడా మేకర్స్ మిస్ చేసుకున్నారని చెప్పక తప్పదు. ఇక నెక్స్ట్ ప్రీరిలీజ్ అయితే తెలుగు స్టేట్స్ లో వరకు సేవ్ చేయొచ్చు కానీ పాన్ ఇండియా లెవెల్లో సినిమాకి కావాల్సిన అటెన్షన్ కావాలంటే ఇప్పుడు లానే ఉంటే డిజప్పాయింట్మెంట్ తప్పదు.