పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమాకు ఓటీటీలో ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.
ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో ఢమాల్ అన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన రోజే టాప్ 1 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దీంతో వీరమల్లు టీమ్ సంతోషం వ్యక్తం చేస్తుంది.
ఈ సినిమాకు వస్తున్న ట్రెమెండస్ రెస్పాన్స్‌తో ఈ సినిమా మున్ముందు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు.