మేకింగ్ వీడియోతో పాటు ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చిన వీరమల్లు

HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. రిలీజ్‌కు దగ్గరపడుతున్న తరుణంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇలాంటి హిస్టారికల్ ఎపిక్ చిత్రాన్ని ఇంత గ్రాండియర్‌గా మలిచేందుకు చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో మనకు ఈ వీడియోలో చూపెట్టారు. ఇందులోని భారీ క్యాస్టింగ్, భారీ సెట్టింగ్స్‌తో ఈ మేకింగ్ వీడియో అద్భుతంగా ఉంది. ఇక ఈ మేకింగ్ వీడియోకు ఓ థీమ్ సాంగ్‌ను కూడా జోడించారు. ఇది అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ‘పలి, మేక ఆట’ అనే పాటగా ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది.

ఇక ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా హారిక నారాయణ్ పాడారు. కీరవాణి మరోసారి తనదైన ట్యూన్స్‌తో ఈ పాటను ఆసక్తికరంగా మలిచారు. మొత్తానికి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లేలా ఈ సాంగ్, మేకింగ్ వీడియో ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 24న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version