‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ చిన్న పిల్లలా చిలిపి ఉహలతో ‘వర్షం’లో గెంతులేసి, మన తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచిన తార త్రిష. ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ కు స్నేహితురాలిగా కనబడి వెండితెరకు పరిచయం అయిన ఆమె తెలుగులో నటించిన ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలు భారీ విజయం సాదించాడంతో అగ్రతారల జాబితాలోకి చేరిపోయింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రకధానాయకుల సరసన నటించింది. ముఖ్యంగా వెంకటేష్ తో ‘ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘నమో వెంకటేశ’, ‘బాడీగార్డ్’ సినిమాలలో జంటగా నటించి హ్యాట్ ట్రిక్ విజయాలను అందుకుంది.’కట్టా మీటా’ సినిమా ద్వారా బాలీవుడ్లో కూడా తన ఉనికిని చాటుకుంది. త్రిషన సినీ రంగంలోకి రాకముందే మిస్ ఇండియా ఫ్రెష్ స్మైల్ అవార్డును సొంతం చేసుకుంది. త్రిష జంతు ప్రేమికురాలు. ప్రస్తుతం ఆమె ‘రమ్(రంభ, ఊర్వసి,మేనక)’ సినిమాలో నటిస్తుంది. ఈరోజు ఈ అందాల తార జన్మదినాన్ని పురస్కరించుకుని 123తెలుగు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.