ఈ 2014 సంవత్సరం మీకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. పోయిన యేడాదితో పోలిస్తే ఈ 2013తెలుగు సినిమా రంగానికి కాస్త ప్రత్యేకం. చిన్నా పెద్దా కలిపి ఏకంగా 160 డైరెక్ట్ సినిమాలు ఈ యేడాదిలో విడుదలయ్యాయి. అందులో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ కొత్త రికార్డులను సృష్టిస్తే, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మల్టీ స్టారర్ సినిమాలకు, కొత్త దర్శకులకు నాందిపలికింది
మా సైట్ పై మీరు చూపించిన ఆదరణ మరువలేనిది. నిజమైన వార్తాలతో, సబబైన సమీక్షలతో మేము మాపై మీ అంచనాలను రోజురోజుకూ పెంచుతూ అదేకాలంలో వాటిని అందుకునేలా ఎదుగుతూ ఒక స్థాయికి చేరుకున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మీకు మరింత నాణ్యమైన, వినూత్నమైన వార్తలను అందిస్తామని ఆశిస్తూ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీ 123telugu