ఈ నెలాఖరున విడుదల కానున్న హ్యాపీ జర్నీ !

ఈ నెలాఖరున విడుదల కానున్న హ్యాపీ జర్నీ !

Published on Oct 5, 2025 10:30 AM IST

Happy Journey

హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ హ్యాపీ జర్నీ’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ కోసం కార్యక్రమాలు జరుపుకుంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘హ్యాపీ జర్నీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గంగాధర్ పెద్ద కొండ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాము. దేశభక్తి నేపథ్యంలో సాగే వెరైటీ కథ ఇది. ఈ చిత్రంలోని వందేమాతరం పాటను ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రoతో ప్రేక్షకులు ముందుకు రానున్నాం. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అని అన్నారు. హ్యాపీ జర్నీ సినిమా అక్టోబర్ నెలాఖరున విడుదల కానుంది.

దర్శకుడు చైతన్య కొండ అన్నారు, “ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. చిన్నప్పుడు ‘మేజర్ చంద్రకాంత్’, తర్వాత ‘ఖడ్గం’ చిత్రాలు నాకు ప్రేరణ అయ్యాయి. ఆ స్థాయి ఎమోషన్లతో ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని చెప్పారు.

తాజా వార్తలు