వరుణ్ సందేశ్ కి హ్యాపీ డేస్ ఫస్ట్ చమ్మక్ చల్లో నెక్స్ట్

వరుణ్ సందేశ్ కి హ్యాపీ డేస్ ఫస్ట్ చమ్మక్ చల్లో నెక్స్ట్

Published on Feb 12, 2013 12:42 AM IST

Chammak-Challo
యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చమ్మక్ చల్లో’ ఫిబ్రవరి 15న విడుదల కానుంది. నీలకంఠ డైరెక్ట్ చేసిన ఈ ఫస్ట్ కమర్షియల్ సినిమాలో సంచితా పడుకొనే, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటించారు. డి.ఎస్ రావు నిర్మించిన ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ వేడుక ఈ రోజు హైదరాబాద్లో జరిగింది. ‘ ఈ సినిమాలో నా పేరు శ్యామ్, హ్యాపీ డేస్ సినిమా తర్వాత నేను కాలేజ్ బ్యాక్ డ్రాప్ డ్రాప్ లో చేసిన సినిమా ఇది. మ్యూజిక్ – సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. డి.ఎస్ రావు ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. ఈ సినిమా విజయం సాదిస్తుందన్న నమ్మకం ఉందని’ వరుణ్ సందేశ్ అన్నాడు.

నీలకంఠ మాట్లాడుతూ ‘ నా గత సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గిందని చాలా మంది అన్నారు. ఈ సినిమా నేను చేసిన మొదటి రొమాంటిక్ ఎంటర్టైనర్, ఈ సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని ‘ అన్నాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ డిస్టిబ్యూట్ చేస్తోంది.

తాజా వార్తలు