‘ఆది’ సినిమాతో దర్శకుడిగా తెలుగు వారికి పరిచయమైన వివి వినాయక్ మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేసి మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. వినాయక్ 1974 అక్టోబర్ 4న పశ్చిమ గోదావరిలోని చాగల్లు అనే గ్రామంలో కృష్ణరావు – నాగరత్నం అనే దంపతులకు జన్మించారు. సినిమాల మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగేసిన వినాయక్ 2002లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ‘ఆది’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేసాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసారు.
‘ఆది’, ‘దిల్’, ‘ఠాగూర్’, ‘బన్ని’,’లక్ష్మీ’, ‘కృష్ణ’, ‘అదుర్స్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్న వినాయక్ చివరిగా చేసిన సినిమా ‘నాయక్’. ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయిని పరిచయం చేయనున్న సినిమా పనిలో బిజీ గా ఉన్నాడు. ఈ నెల 20 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
వివి వినాయక్ గారి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.