సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు


ఈరోజు తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో ఒకరయిన సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టిన రోజు. గుంటూరు జిల్లా,బుర్రిపాలెం లో 1943 మే 31న ఘట్టమనేని శివ రామ కృష్ణగా జన్మించారు. దాదాపుగా తెలుగు పరిశ్రమలో నాలుగు దశాబ్దాల పాటు నటించారు. 1965లో చిన్న పాత్రలతో మొదలు పెట్టిన తన సిని ప్రస్థానం మెల్లగా చిత్ర పరిశ్రమలో ప్రముఖ తారల్లో ఒకరిగా చేరింది. కృష్ణ గారు తెలుగు తెరకి ఎన్నో సాంకేతిక విషయాలని పరిచయం చేశారు.

DTS, కలర్ ఫిలిం, 70mm మరియు సినిమా స్కోప్ వంటివి తెలుగు తెరకు పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారే ఇది కాకుండా కౌ బాయ్ మరియు సిక్రెట్ ఏజెంట్స్ వంటి చిత్రాలను కూడా కృష్ణ గారే తెలుగు తెరకు పరిచయం చేశారు. “మోసగాళ్ళకి మోసగాడు” మరియు “గూడాచారి 116″ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర గమనాన్ని మార్చారు.

కృష్ణ గారి ఖాతాల్లో 350కి పైగా చిత్రాలు ఉన్నాయి అందులో భారీ విజయాలు సాదించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ” దేవుడు చేసిన మనుషులు”,”అల్లూరి సీతారామ రాజు”,”మోసగాళ్ళకి మోసగాడు”, ” పండంటి కాపురం”, “అవే కళ్ళు” వంటి చిత్రాలు ఇప్పటికి గుర్తుండిపోయే చిత్రాలు.

అయన వ్యక్తిగా ఎంత గోప్పవారో అందరికి తెలిసిన విషయమే, తెలుగు పరిశ్రమలో అటువంటి నటుడు ఉన్నందుకు గర్వపడాల్సిన విషయం. సూపర్ స్టార్ కృష్ణ గారికి 123తెలుగు.కాం తరుపున జన్మదిన శుభాకాంక్షలు.

Exit mobile version