ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు

SP-Balasubramanyam1

ఈ రోజు ప్రముఖ సింగర్ ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారి పుట్టిన రోజు. ప్రస్తుతం ఆయనకి 67 సంవత్సరాలు. ఈ వయస్సు లో కూడా ఆయనది గోల్డెన్ వాయిస్. బాలు గారు జూన్ 4, 1946లో బ్రాహ్మణ కుటుంబంలో నెల్లూర్లో జన్మించిన ఆయన చిన్న వయస్సు నుండే పాటలు పాడటం మొదలు పెట్టాడు. ఆయన జె.ఎన్.టి.యులో ఇంజనేరింగ్ చదివారు. ఆయన పాటలు పాడటం ఒక ఆలవాటుగా ఉండేది. చాలా కాంటెస్ట్ లలో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ఆయన గానం కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ల మనసును ఆకట్టుకుంది. బాలసుబ్రమణ్యం గారికి 1966 లో ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ లో పాడిన పాటలకి మొదటి సారిగా మంఛి గుర్తింపు వచ్చింది.

బాలు గారు దాదాపు 40,000 వరకు పాటలు పాడారు. ఆయన సింగర్ గా ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం బాలసుబ్రమణ్యం గారికి 25 సార్లు నంది అవార్డ్ ను బహుకరించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకి 2011లో ‘పద్మ భూషణ్’ ఇచ్చి గౌరవించింది. దీనితో పాటుగా ఆయన మరో ఆరు నేషినల్ అవార్డ్ లు కూడా వచ్చాయి.

అసాదారణమైన ఉచ్చారణ, స్పష్టమైన, పరిపూర్ణమైన ఉచ్చారణ అలాగే పాటని పడేటప్పుడు హీరో వాయిస్ ని అనుకరించటం బాలసుబ్రమణ్యం గారి ప్రత్యేకత.

123తెలుగు.కామ్ తరుపున శ్రీ ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు

Exit mobile version