తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకులలో ఒకరైన కె. రాఘవేంద్ర రావు ఈ రోజు తన 71వ పుట్టిన రోజు వేడుకని జరుపుకోనున్నారు. ఆయన 1970 నుండి సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించాడు. 70లో ‘అడవి రాముడు’, ‘డ్రైవర్ రాముడు’ లాంటి కమర్షియల్ సినిమాలను తీశాడు. అలాగే 80లో కొన్ని హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ఈయన జీవితాన్నిఒక మలుపు తిప్పింది. 90లో ఈయన దర్శకత్వం వహించిన ‘అల్లుడు గారు’, ‘కూలి నెం 1’, ‘ఘరానా మొగుడు’, ‘సుందర కాండ’, ‘అల్లరి మొగుడు’. ‘అల్లరి ప్రియుడు’ లాంటి సినిమాలు భారీ విజయాన్ని సాదించాయి.
హీరోయిన్స్ ని అందంగా చూపించడంలో రాఘవేంద్ర రావు కి ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్తిరస సినిమాలు ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’, ‘షిరిడి సాయి’ లాంటివి తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఇంటింటా అన్నమయ్య’ . ఈ సినిమాలో రేవత్ హీరోగా, అనన్య, సనమ్ శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక్క పాటకు తప్ప అన్ని పాటలకు రాఘవేంద్రరావు గారు కోరియోగ్రఫీగా పనిచేశారు. ఈ సినిమా ఈ నెల 31 న విడుదలకానుంది.
123తెలుగు.కామ్ తరుపున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కి జన్మదిన శుభాకాంక్షలు