యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు

యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు

Published on Aug 2, 2012 6:44 PM IST


యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ తన ఎనర్జిటిక్ సంగీతంతో సౌంత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపుతున్న మ్యూజిక్ డైరెక్టర్. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని వెదురుపాకలో 1979లో ఆగష్టు 2న జన్మించారు. చిన్ననాటి నుంచి సంగీతం పై ఎంతో ఆసక్తి ఉండడంతో సంగీతం నేర్చుకున్నారు. ఎం.ఎస్ రాజు నిర్మించిన ‘దేవీ’ చిత్రంతో దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో, దేవీ శ్రీ సంగీతం అందించిన ‘ఆనందం’ చిత్రంతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తను మ్యూజిక్ ఇచ్చిన ‘ఖడ్గం’, ‘వర్షం’, ‘వెంకీ’, ‘ఆర్య’, ‘ మాస్’ మరియు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాలతో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన ఎం.ఎం కీరవాణి, మణిశర్మ పక్కన చేరిపోయారు. మామూలుగా దేవీ శ్రీ ఎంతో ఎనర్జిటిక్ గా మ్యూజిక్ మాత్రమే కాకుండా స్టేజ్ షోలలో పాటలు పాడుతూ స్తేప్పులేయడమే కాకుండా ఫంక్షన్ కి వచ్చిన ప్రేక్షకులకు కరెంట్ పాస్ చేస్తారు.

దేవీ శ్రీ ఒక్క తెలుగు లోనే కాకుండా తమిళం, కన్నడ బాషలలో కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్ లో పరిచయమవుతున్నారు. దేవీ శ్రీ సంగీతం అందించిన ‘జులాయి’ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో కూడా దేవీ శ్రీ సంగీతం మారు మ్రోగి పోవాలని కోరుకుందాం. దేవీ శ్రీ ప్రసాద్ ఇకముందు కూడా ఆయన ఇలానే మంచి సంగీతాన్ని అందిస్తూ ఇంకా ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుందాం.

ఈ రోజు దేవీ శ్రీ ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఈ యంగ్ తరంగ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు