టాలీవుడ్ డిఫరెంట్ దర్శకులకు జన్మదిన శుభాకాంక్షలు

chandhra-shekar-nandini-red
టాలీవుడ్ లో విభిన్న తరహా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి, నందిని రెడ్డిలు కూడా ఉన్నారు. ఈ ఇద్దరి దర్శకుల పుట్టిన రోజు ఈ రోజు. వీళ్ళిద్దరూ ఒకేరోజు పుట్టిన రోజుని షేర్ చేసుకోవడమే కాదు వీరు తీసిన మొదటి సినిమాతోనే నంది అవార్డు కూడా గెలుచుకున్నారు.

చంద్రశేఖర్ యేలేటి, నందిని రెడ్డి ఇద్దారూ గున్న గంగరాజు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసారు. దర్శకులైన తర్వాత వీరిద్దరూ ఒక్కో స్టైల్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి చివరిగా అడ్వెంచర్ ఫిల్మ్ సాహసంతో సక్సెస్ అందుకుంటే, నందిని రెడ్డి జబర్దస్త్ సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నారు. ప్రస్తుతం వీరిరువురు తమ తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారు.

ఈ రోజు వీరి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున చంద్రశేఖర్ యేలేటి, నందిని రెడ్డి లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version