ఎస్.ఎస్ తమన్ కి జన్మదిన శుభాకాంక్షలు


ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ కేకుల్లా టాప్ హీరోలకి ట్యూన్స్ ఇస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్. ఈ రోజు తన 26వ పుట్టిన రోజు వేడుకని జరుపుకుంటున్నాడు. సంగీత విద్వాంసుల ఫ్యామిలీలో పుట్టిన తమన్ తన చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో చదువు ఆపేసి 13వ ఏటనే రిథం పాడ్స్ ప్లేయర్ గా కెరీర్ ప్రారంభించాడు. తన హాబీ గా ఉన్న మ్యూజిక్ ని తన ఫ్యామిలీ కోసం అదే తన కెరీర్ గా మార్చుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన రాజ్ – కోటి, ఎం.ఎం కీరవాణి మరియు మణిశర్మ మొదలైన వారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాడు. శంకర్ తీసిన ‘బాయ్స్’ సినిమా ద్వారా తెరకు కూడా పరిచయమైన తమన్, ఆ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి డ్రమ్స్ కూడా వాయించారు.

రవితేజ నటించిన ‘కిక్’ సినిమా ద్వారా వెలుగులొకీ వచ్చిన తమన్ ఆతర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన వరుసగా ‘బృందావనం’, ‘మిరపకాయ్’, ‘దూకుడు’ మరియు ‘ బుజినెస్ మాన్’ సినిమాలతో వరుస హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం తమన్ ‘బాద్షా’, ‘నాయక్’, ‘షాడో’ మరియు ఎన్.టి.ఆర్ – హరీష్ శకర్ కాంబినేషన్లో రానున్న ఓ సినిమాకి మ్యూజిక్ కంపోస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Exit mobile version