సాయి కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు.

సాయి కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు.

Published on Jul 27, 2013 3:00 PM IST

sai-kumar-birthday

టాలీవుడ్ లో మంచి టాలెంట్ వున్న నటుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ ఈ రోజు 52వ పుట్టినరోజు వేడుకని జరుపుకుంటున్నాడు. సాయి కుమార్ మొదటగా హీరోలకు సుమన్, రాజశేఖర్ లకు డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంబించాడు. తను దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలా డబ్బింగ్ చెబుతూనే తను నటించడం కూడా మొదలు పెట్టాడు.

సాయి కుమార్ కెరీర్ లో అతి పెద్ద హిట్ సినిమా ‘పోలీస్ స్టొరీ’. ఈ సినిమాలో తను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆ తరువాత చాలా కన్నడ, తెలుగు సినిమాలలో నటించాడు. ఆయన నటించిన ‘ప్రస్థానం’ సినిమాలోని నటనకు ఆయనకు అవార్డ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమాలో నటిస్తున్నాడు.

123తెలుగు.కామ్ తరుపున సాయి కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు.

తాజా వార్తలు