రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

Published on Mar 27, 2012 10:28 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేటితో 27 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ‘చిరుత’ సినిమాతో మెగా స్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ‘మగధీర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి అందరి చూపు తనమీద పడేలా చేసాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరుతగా రంగ ప్రవేశం చేసి డాన్సుల్లో, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేక శైలి రూపొందించుకున్నాడు. ఆ తరువాత అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర చిత్రంతో తన స్టామినా తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించాడు. ఆ చిత్రం అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన ‘ఆరంజ్’ నిరాశ పరిచినప్పటికీ చరణ్ లోని విభిన్న నటుడిని బైటికి తీసుకు వచ్చేలా చేసింది. ప్రస్తుతం ‘రచ్చ’ సినిమా చేస్తున్న చరణ్ చివరి పాట చిత్రీకరణ కోసం పొల్లాచ్చి వెళ్ళబోతున్నాడు. రచ్చ సినిమాతో మరో సారి హిట్ కోడతానంటున్న రామ్ చరణ్ కి 123 తెలుగు.కాం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు