రామ్ కి జన్మదిన శుభాకాంక్షలు

రామ్ కి జన్మదిన శుభాకాంక్షలు

Published on May 15, 2013 9:00 AM IST

ram
ఈ రోజు (మే 15) ఎనర్జిటిక్ హీరో, ఇండస్ట్రీలో మంచి లుకింగ్ యాక్టర్ రామ్ పుట్టినరోజు. తను హై లెవల్ ఎనర్జీతో, మంచి డాన్స్ లతో చాలా తక్కువ సమయంలో మంచి పేరును సంపాదించుకున్నాడు. తను మే 15, 1988లో జన్మించాడు. తను ఈ రోజు 25వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. రామ్ చిన్న తనంలో ఎక్కువగా చెన్నై లో వున్నాడు. కావున తను తమిళంలో చక్కగా మాట్లాడుతాడు. తను 2006లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘దేవదాసు’ సినిమాతో అడుగుపెట్టాడు. అ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వీటితో పాటు ‘రెడీ’, ‘కందిరీగ’ లాంటి హిట్ సినిమాలలో నటించాడు. రామ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘గరం మసాలా’ షూటింగ్ లో బిజీగా వున్నాడు.

123తెలుగు.కామ్ తరుపున ఎనర్జిటిక్ హీరో రామ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

తాజా వార్తలు