నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు

Balakrishna

టాలీవుడ్ పాపులర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ రోజు 53వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. బాలయ్య బాబు 1960 జూన్ 10న శ్రీ నందమూరి తారక రామారావు – బసవతారకమ్మ దంపతులకు మద్రాసులో జన్మించాడు. బాలకృష్ణ ఎన్.టి.ఆర్ గారి ఆరవ కొడుకు, అలాగే ఆయన బాల్యం అంతా చెన్నైలో గడిచింది. 1974 లో వచ్చిన ‘తాతమ్మ కథ’ సినిమాతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఎమోషనల్, మాస్ ఎంటర్టైనర్స్ తీయడంలో బాలకృష్ణ గారికి ప్రత్యేక పేరుంది. ఆయన చెప్పిన పంచ్ డైలాగ్స్, యాక్షన్ ఎంటర్టైనర్స్ సినిమాలతో మాస్ ప్రేక్షకులను మెప్పించి పెద్ద పెద్ద హిట్స్ అందుకున్నారు. ‘సింహా’, ‘నరసింహ నాయుడు’, ‘సమరసింహా రెడ్డి’, ‘భైరవ ద్వీపం’, ఆదిత్య 369′, ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘లారీ డ్రైవర్’, ‘మంగమ్మ గారి మనవడు’, ‘నారి నారి నడుమ మురారి’, ‘ముద్దుల మావయ్య’ లాంటి కొన్ని సినిమాలు బాలకృష్ణ కేరీలో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

త్వరలోనే బాలయ్య తన చేయబోయే కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. సాయి కొర్రాపాటి సమర్పణలో, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడు.

నట సింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version