ఎమ్.ఎమ్. కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు

ఎమ్.ఎమ్. కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు

Published on Jul 4, 2013 11:00 AM IST

keeravani

తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లో ఎమ్.ఎమ్. కీరవాణి ఒక వైవిధ్యమైన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈరోజు 52 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆయన 1980లో కొన్ని సంవత్సరాలు చక్రవర్తి గారి దగ్గర పనిచేశాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సోలోగా సంగీతాన్ని అందించిన మొదటి సినిమా ‘మనసు మమత’. ఈ సినిమా జూన్ 29, 1990లో విడుదలైంది. కానీ రాంగోపాల్ వర్మ ‘క్షణ క్షణం’ సినిమాతో కీరవాణి గారికి మంచి గుర్తింపు లబించింది. అప్పటి నుండి ఆయన కె. రాఘవేంద్ర రావు గారి ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి ప్రియుడు’, ‘అన్నమయ్య’ మొదలగు సినిమాలకు సంగీతాన్ని అందించాడు. అలాగే అయన ఎస్.ఎస్. రాజమౌళి గారికి చాలా క్లోజ్ కావడంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమా లకు కీరవాణి గారే సంగీతాన్ని అందించాడు. అలాగే ఇతర డైరెక్టర్స్ తో కలిసి తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు కూడా సంగీతాన్ని అందించాడు.

ఈయన హిందీలో ‘జాఖం’, ‘పహేలి’, ‘జిస్మ్’, ‘స్పెషల్ 26’ లాంటి సినిమాలకు సంగీతాన్ని అందించాడు. బాలీవుడ్ లో ఆయనని ఎమ్.ఎమ్. క్రీమ్ అని అంటారు. ప్రస్తుతం ఆయన యు.ఎస్ లో ఉన్నాడు. ఆయన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘బాహుబలి’, శేఖర్ కమ్ముల ‘అనామిక’ చంద్ర సిద్దార్థ ‘ఏమో గుర్రం ఎగరవచ్చు’ సినిమాలకు ప్రస్తుతం సంగీతాన్ని అందిస్తున్నాడు.

123తెలుగు.కామ్ తరుపున ఎమ్.ఎమ్. కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు