లక్ష్మీ మంచుకి జన్మదిన శుభాకాంక్షలు


కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు గారి కుమార్తెగా తెలుగు వారికి పరిచయమయ్యారు లక్ష్మీ మంచు. ఆ తర్వాత వైధ్యమైన పనులు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం లక్ష్మీ మంచు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నటిగా, టీవీ వ్యాఖ్యాతగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డా. మోహన్ బాబు మరియు శ్రీమతి విద్యాదేవిలకు 1976 అక్టోబర్ 8న లక్ష్మీ మంచు జన్మించారు. ఆమె ఆండీ శ్రీనివాసన్ ని వివాహం చేసారు.

ఇండియాలో ఆమె చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఓక్లహోమ సిటీ యూనివర్సిటీ లో థియేటర్ గురించి నేర్చుకోవడానికి యు.ఎస్ వెళ్ళారు. ‘లాస్ వెగాస్’ మరియు ‘డెస్పరేట్ హౌస్ వైఫ్స్’ అనే పాపులర్ అమెరికన్ టీవీ షోలలో కూడా కనిపించారు. ఆ తర్వాత ఇండియా వచ్చి ఇక్కడ చేసిన ‘లక్ష్మీ టాక్ షో’ అనే ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. లక్ష్మీ మొదటి సారిగా ‘అనగనగా ఓ ధీరుడు’ నటించిన ఐరెంద్రి పాత్రకి ఎన్నో అవార్డులను అందుకుంది.

ప్రస్తుతం లక్ష్మీ మంచు నటించిన చిత్రాలు ఈ సంవత్సరం వరుసగా విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో మొదటిది తనే నటిగా మరియు నిర్మాతగా తీసిన ‘గుండెల్లో గోదారి’. 1986లో జరిగిన గోదావరి వరదలని నేపధ్యంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండవది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న’కాదల్’.

ఈ రోజు లక్ష్మీ మంచు పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version