ఆయన వాడే పదాలను పదే పదే పలకాలనిపిస్తుంది. ఆయన ఉపయోగించే అక్షరాలతో అరక్షణాలలో మనకు దగ్గరైపోతారు. పల్లవిలో ప్రాస వెల్లివిరుస్తుంది. చరణాలలోని భావాలను అర్ధంచేసుకున్నాక ఆయన చరాణాలకు మొక్కాలనిపిస్తుంది. మొత్తానికి పాటను పాటలాకాక ఒక తియ్యనిమాటలా మార్చిన నేటితరపు రచయిత చంద్రబోస్
‘నేనున్నాను అని చీకటితో వెలుగు చెప్పినా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగామని నెంబర్ 1 స్టూడెంట్ తన మిత్రులను ఉద్దేశించినా, మౌనంగానే ఎదగమని మనసులోతులని తట్టినా, పంచదారా బొమ్మా బొమ్మా అంటూ మాగధీరుని మనసుని దోచినా, రింగా రింగా రొసేస్ అని చదువుకునే వారిచేత కుడా రింగా రింగా అనిపించినా’ ఎలాగైనా అది ఆయనకే చెల్లుతుంది. ఆయాన కలం ఇలాగే కలకాలం సాగాలని కోరుకుంటూ 123తెలుగు ద్వారా చంద్రబోస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు