తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యమైన పిఆర్వో లలో బిఎ రాజు గారు ఒకరు. బాగా పేరొందిన సూపర్ హిట్ మ్యాగజైన్ అధినేత. ఆయన రేపు పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఇంతటి ప్రతిభావంతుడైన రాజు గారు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఆయన మరో కొత్త సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన భార్య బి.జయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘లవ్లీ’ అనే చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నాడు. బిఎ రాజు గారు పిఆర్వో గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను పని చేసారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు వంటి పలు అగ్ర హీరోల చిత్రాలకు కూడా పని చేసారు. ఆయన పిఆర్వో గా పని చేయకముందు జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు.
123తెలుగు.కాం తరపున బిఎ రాజు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.