కైకాల సత్యనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు

కైకాల సత్యనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు

Published on Jul 25, 2012 12:22 PM IST


తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నవరస నటనా సార్వభౌమ అని అనిపించుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 1935 జూలై 25న కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించారు. ఆయన చిన్న తనం మరియు విద్యాభ్యాసం అంతా గుడివాడలోనే జరిగింది. 1959 లో డి.ఎల్ నారాయణ నిర్మాతగా చంగయ్య దర్శకత్వంలో వచ్చిన ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం విజయం సాదించకపోయినా సత్యనారాయణకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. నందమూరి తారక రామారావు గారికి సత్యనారాయణ చాలా సినిమాల్లో డూప్ గా చేశారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ నటించిన ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’ చిత్రంలో రాజకుమారుడి పాత్ర పోషించారు. అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు.

సుమారు 220 చిత్రాల్లో నటించిన సత్యనారాయణ నటుడిగానే కాకుండా రామ ఫిల్మ్స్ ప్రొడక్షన్ స్తాపించి నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. 1996లో మచిలీపట్నం నుండి లోక్ సభకి పోటీ చేసి రాజకీయాల్లో కూడావిజయం సాదించారు. డెబ్బై పదుల వయస్సులో కూడా ఇప్పటికీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన ఇలానే మరిన్ని చిత్రాలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందాలని కోరుకుందాం.

ఈ రోజు సత్యనారాయణ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున నవరస నటనా సార్వభౌముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు