వృద్దాశ్రమం నిర్మించాలనుకుంటున్న హన్సిక

వృద్దాశ్రమం నిర్మించాలనుకుంటున్న హన్సిక

Published on Mar 17, 2012 11:21 AM IST


తన ఇరవయ్యో ఏట ఇరవై మంది పిల్లల్ని దత్తత తీసుకున్న హన్సిక ఇప్పుడు ఒక వృద్దాశ్రమం కట్టే ఆలోచన లో ఉన్నారు “ఆర్థ మీడోస్” కి ప్రచార కర్త గా ఎంపికయిన ఈ భామ ఆ ప్రాజెక్ట్ ప్రారంభంలో మాట్లాడుతూ “ఇంతటి పెద్ద ప్రాజెక్ట్ కి నేను ప్రచారం చెయ్యటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే విల్లాస్, నాకు ఇష్టమయిన వాళ్ళ కోసం ఒక విల్లా నిర్మించాలని నా కల, ప్రత్యేకంగా వయసు మళ్ళిన వారి కోసం నిర్మించాలని ఉంటుంది ఎప్పుడయినా రోడ్ మీద ఇలా వయసు మళ్ళిన వారిని చూస్తే చాలా బాధ వేస్తుంది వారిని నాతో పాటు తీసుకు వెళ్ళాలనిపిస్తుంది. నాకు కళల మీద ఉన్న ఆసక్తిని వాడుకొని నా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టి అందులో వచ్చే డబ్బుని వృద్దాశ్రమం నిర్మించడానికి ఉపయోగిస్తాను” అని అన్నారు. ప్రస్తుతం ఈ నటి “ఒరు కల ఒరు కన్నాది” చిత్ర విడుదల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

తాజా వార్తలు