హన్సికతో మరోసారి జతకట్టనున్న ఆర్య

హన్సికతో మరోసారి జతకట్టనున్న ఆర్య

Published on Jan 30, 2014 1:29 AM IST

arya_hansika
సమాచారం ప్రకారం అందాల భామ హన్సిక మరోసారి ఆర్యతో కలిసి నటించనుంది. గతంలో వీరిద్ధరూ హిందీలో సూపర్ హిట్ అయిన డెల్లి బెల్లి సినిమా రీమేక్ లో నటించారు అది తెలుగులో క్రేజీ గా మనముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త సినిమాను మాగీజ్ తిరుమనేని తెరకెక్కిస్తున్నాడు. ‘మేగమాన్’ అనే టైటిల్ ను సూచించారు

విడాకులు తీసుకుని విడిపోయిన ఒకరిపాపను దత్తత తీసుకుని ఈ భామ వార్తలలో నిలిచింది. తన చదువు, పోషణ అవసరాలు తానే చూస్కుంటానని మాటిచ్చింది. ఇప్పటివరకూ 25మంది పిల్లలను దత్తత తీసుకున్న ఈ భామ వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది

ప్రస్తుతం పవర్ సినిమాలో రవితేజ సరసన నటిస్తుంది. ఇందులో హన్సిక అల్ట్రా గ్లామర్ గా కనిపించనుంది. బాబీ దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. ఈ జనవరి 31న పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో ఒక హీరోయిన్ గా కనిపించనుంది

తాజా వార్తలు