రెండు వరుస విజయాలతో మంచి ఫామ్ లో వున్న నితిన్ చేతిలో ప్రస్తుతం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’, ‘హార్ట్ అటాక్’ వంటి సినిమాలతో బిజీగావున్నాడు. ఇప్పుడు కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. ఇది నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ లో నిర్మాణమవుతుంది. సమాచారం ప్రకారం ఈ సినిమాలో నితిన్ కు జంటగా హన్సికను ఎంపిక చేస్కున్నారు. వీరిద్దరూ ఇదివరకు ‘సీతారాములకళ్యాణం.. లంకలో’ అనే సినిమాలో నటించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్న హన్సిక ఇప్పుడు టాలీవుడ్లో కొన్ని సినిమాలను అంగీకరిస్తుంది. ప్రస్తుతం విష్ణు సరసన నటిస్తున్న ఈ భామ త్వరలో నాగ చైతన్య హీరోగా కనిపించే మరో సినిమాను కూడా అంగీకరించింది.