నాకు చాలా విషయాలు తెలుసంటున్న హన్సిక

నాకు చాలా విషయాలు తెలుసంటున్న హన్సిక

Published on Nov 26, 2013 9:30 AM IST

Hansika-Motwani-3
బాలనటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హన్సిక ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం హన్సిక చేతిలో ఒకటి కాదు రెండు కాదు 8 సినిమాలు ఉన్నాయి. అలాగే హన్సిక కూడా ఏ మాత్రం తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఈ భామ స్కూల్ కి వెళ్ళడం కంటే సినిమా సెట్స్ కి ఎక్కువ వెళ్లి ఉంటారు.

అలాంటి హన్సికని మీకు సినిమా కాకుండా ఇంకా మీకు ఏమేం తెలుసు? అని అడిగితే హన్సిక సమాధానమిస్తూ ‘వాస్తవానికైతే నా కెరీర్ ప్రకారం నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియకూడదు కానీ నాకు చాలా విషయాలు తెలుసు. బయటి ప్రపంచం గురించి అవగాహన ఉంది, అలాగే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. పుస్తకాలు బాగా ఎక్కువగానే చదువుతాను. దానివల్ల ఎంతోమంది జీవితాల గురించి తెలుసుకోగలిగాను. అలాగే నాకు ముందు చూపు ఎక్కువ. పనికి తగ్గట్టుగా ప్రణాలికలు ఉండాలి. అప్పుడు ఫలితాలుంటాయని’ చెప్పింది.

తాజా వార్తలు