బిరియాని చిత్రీకరణ మొదలుపెట్టుకున్న హన్సిక

బిరియాని చిత్రీకరణ మొదలుపెట్టుకున్న హన్సిక

Published on Nov 15, 2012 11:29 PM IST

కార్తి రాబోతున్న చిత్రం “బిరియాని” చిత్రీకరణలో హన్సిక పాల్గొంటుంది. కార్తి సరసన హన్సిక నటించడం ఇదే మొదటిసారి ఈ చిత్రం గురించి హన్సిక ఆసక్తిగా ఉన్నారు. మొదట రిచా గంగోపాధ్యాయ్ చెయ్యాల్సిన ఈ చిత్రంలో ఆమె స్థానంలో హన్సిక చేరారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నారు. స్నేహ,ప్రసన్న,ప్రేమ్గి మరియు యు కే నుండి వచ్చిన కొత్త నటి మండి తక్కర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తుండగా శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గతంలో వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన “చెన్నై 28″, ” సరోజ”,”గోవా” మరియు “మంకాత(గ్యాంబ్లర్)” చిత్రాలను తెలుగులో డబ్ చేశారు ఈ చిత్రాన్ని కూడా తెలుగులో డబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం 2013లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు