హన్సిక తమిళ్ సినిమా అభిమానులకి డ్రీం గర్ల్ గా మారిపోయింది. ఆమె తమిళ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఒక సంవత్సరం లోనే చల్ల మంది అభిమానుల్ని మరియు పెద్ద స్టార్స్ పక్కన నటించే అవకాశాలు దక్కించుకుంది. సింగపూర్లో ఉండే తమిళ్ సినిమాకి సంభందించిన తమిళ్ అసోసియేషన్ వారు ఆమెని డ్రీం గర్ల్ గా ఓట్ చేసారు. వారి నుండి డ్రీం గర్ల్ అవార్డు అందుకోవడంతో హన్సిక చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆమె మంచు మనోజ్ సరసన ‘దొరకడు’ మరియు ‘ఓకే ఓకే’ అనే తమిళ్ సినిమాల్లో నటిస్తోంది.