పుకార్లను పట్టించుకోనన్న హన్సిక

First Posted at 21:00 on Apr 22nd

Hansika

హన్సిక తన సహ నటుడితో డేటింగ్ చేస్తుందన్న పుకార్లను కొట్టిపడేసింది. గత కొన్ని నెలలుగా కోలీవుడ్ వార్తల ప్రకారం హన్సిక తమిళ్ లో ఒక అగ్ర నటుడితో ప్రేమాయణం సాగిస్తుందని తమిళనాడులో ఉన్న చాలా పుస్తకాలు, వార్త పత్రికలూ ప్రచురించాయి. ఇప్పుడు ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని హన్సిక తేల్చి చెప్పేసింది. తానూ ఎవరితోనూ ప్రేమలో లేనని తెలిపింది.

“నేను ప్రేమలో ఉన్నా అని చాలా వార్తలు విన్నాక నవ్వడం తప్ప ఏమి చెయ్యలేకపోయాను. ఎందుకంటే నా గురించి నాకే తెలియని విషయాలను చదవడం నాకు ఇష్టం. కానీ నిజాన్ని చెప్పాలి కనుక చెప్తున్నా. మీ మీడియా సృష్టించినట్టు నేను ఎవ్వరితోనూ ప్రేమలో లేను. ఉంటే కనుక ముందు మీకే చెప్తాను. దయచేసి ఈ పుకార్లను ఆపండి. సెలబ్రిటీలకు ఇవి కొత్తవి కావని నాకు తెలిసినా నా ఫ్యాన్స్ కి తప్పుడు సమాచారం ఇవ్వడం నాకు నచ్చదు:) మీడియా మరియు నా కుటుంబం నాకు సహకరిస్తుందని నాకు తెలుసని”ఈ భామ ట్వీట్ చేసింది. తానూ నటిస్తున్న ‘సంథింగ్…. సంథింగ్ ‘ సినిమా షూటింగ్ కోసం హన్సిక జపాన్ వెళ్లి ఈ మధ్యే తిరిగి వచ్చింది. ఇందులోనే కాక ఆమెను ‘సింగం 2’, ‘వాలు’, ‘వెట్టాయ్ మన్నన్’, ‘బిర్యాని’ మరియు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఒక మల్టీ స్టారర్లో కుడా నటిస్తుంది.

Exit mobile version