స్వతహాగా ఇండియన్స్ అయినప్పటికీ అమెరికాలో సెటిల్ అయ్యి సినిమా మీద ఉన్న ఇష్టంతో హైదర్ బిల్గ్రామి తెరకెక్కించిన సినిమా ‘హ్యాంగ్ అప్’. న్యూ యార్క్, న్యూ జెర్సీలో షూట్ చేసిన ఈ థ్రిల్లర్ సినిమా మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం సుధాకర్ హీరోగా నటించగా హాలీవుడ్ బ్యూటీ నాటాలి రౌత్ హీరోయిన్ గా నటించింది.
ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హీరో సుధాకర్ మాట్లాడుతూ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంటే ముందే ఈ సినిమాకి సైన్ చేసాను. కానీ ఇది ఆలస్యంగా విడుదలవుతోంది. ఒక రోజు నైట్ జరిగే ఈ సినిమాలో నేను ఎన్ఆర్ఐ స్టూడెంట్ గా కనిపిస్తాను. అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్న నాకు ఇలాంటి పాత్ర రావడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.
డైరెక్టర్ హైదర్ బిల్గ్రామి మాట్లాడుతూ ‘ తెలుగు, హిందీలో ఈ సినిమాని తీసం. ముందు తెలుగులో రిలీజ్ చేసి ఆ తర్వాత హిందీలో రిలీజ్ చేస్తాం. రాకీ సినిమా చేస్తాప్పుడు సిల్వర్ స్టార్ స్టలోన్ ఉన్న ఇంట్లో ఈ సినిమాని షూట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, హీరో హీరోయిన్ పెర్ఫార్మన్స్ సినిమాకి హైలైట్ అవుతుందని’ అన్నాడు.