షూట్ కి రెడీ అవుతోన్న హంసా నందిని ?

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా సినిమాలోని చిన్న చిన్న పాత్రల కోసం కూడా బాగా తెలిసిన, పలు ఇండస్ట్రీలతో పరిచయం ఉన్న నటీనటుల్ని తీసుకుంటున్న ఆయన హాట్ బాంబ్ హంసా నందినిని కూడా ఒక రోల్ కోసం ఎంపిక చేశాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తరువాత షెడ్యూల్ లో హంసా నందిని షూట్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక గీతాలతో పాపులర్ అయిన ఈమెను జక్కన్న పాత్రకు మాత్రమే పరిమితం చేస్తారో లేకపోతే ఏదైనా స్పెషల్ పాటలో కూడా చూపిస్తారో చూడాలి. గతంలో ‘ఈగ’ చిత్రంలో నటించిన ఆమెకు రాజమౌళితో ఇది రెండవ చిత్రం అవుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న సినిమాని విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దక్షిణా ప్రేక్షకులే కాకుండా అన్ని పరిశ్రమల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version