చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నటి హేమ తెలుగు ప్రేక్షకులకి బాగా తెలుసు. పెద్ద పెద్ద కమెడియన్స్ పక్కన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమని ఓ వ్యక్తి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాడు. అతడిని ఈ రోజు మాదాపూర్ కి చెందిన పోలీసులు అరెస్ట్ చేసారు.
అసలు విషయంలోకి వెళితే ఎలాగో హేమ ఫోన్ నెంబర్ తెలుసుకున్న ఓ కుర్రాడు కొద్ది రోజులుగా హేమకి అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నాడు. ఆ టార్చర్ మరీ ఎక్కువ అవడంతో ఆమె మాదాపూర్ పోలీసులకు ఈ నెల 25న కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ద్వారా అతన్ని టాప్ చేసి పట్టుకున్నారు. అతను నల్గొండ జిల్లాకి చెందిన మధు అని, 10వ తరగతి ఫెయిల్ అయిన అతని పై చాలా కేసులు ఉన్నాయని మాదాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అదుపులోని నిందితుడిని విచారించి ఆ తర్వాత సైబర్ క్రిమనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.