గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తాను అంటే రామ్ చరణ్ మాత్రం ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసుకొని అదే ఫాలో అవుతున్నాడు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడి పెట్ట పాటని మగధీర సినిమాలో రీమిక్స్ సాంగ్ చేసి పెట్టడం, ఆ పాట హిట్ కావడం ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన ‘ఆరంజ్’ సినిమాలో ఎలాంటి రీమిక్స్ సాంగ్ లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితం రాలేదు. ఇటీవలే వచ్చిన ‘రచ్చ’ సినిమాలో గ్యాంగ్ లీడర్ సినిమాలోని వాన వాన వెల్లువాయే పాటని రీమిక్స్ చేయగా ఆ సినిమా కూడా భారీ హిట్ అయింది. ఈ సెంటిమెంట్ బాగా వర్కవుట్ కావడంతో రామ్ చరణ్ ఇదే ట్రెండ్ ఫాలో కావాలనుకున్నాడు.
వివి వినాయక్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కోసం చిరంజీవి సూపర్ హిట్ సినిమా ఖైది నెంబర్ 786 లోని ‘గువ్వా గోరింకతో పాటని రీమిక్స్ చేయనున్నారు. ఈ విషయాన్ని తమన్ తన ట్విట్టర్ అకౌంటులో తెలిపాడు. చరణ్, వినాయక్ సినిమాకోసం ఒక రీమిక్స్ పాట చేస్తున్నట్లు అయితే ఈ పాట ఇంకా ఖరారు చేయలేదనీ, సినిమాలో ఉండే అవకాశం ఉందని తెలిపాడు.