గుండెల్లో గోదారి తమిళ పేరు ఖరారు

గుండెల్లో గోదారి తమిళ పేరు ఖరారు

Published on Feb 4, 2012 7:07 PM IST


తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి చిత్రీకరణ జరపడం ఈ మధ్య కాలం లో మామూలు అయిపోయింది. “ఈగ”,”ఎందుకంటే ప్రేమంట” మరియు “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రాలు ద్విభాషా చిత్రాలుగా రూపొందుతున్నాయి. ఇప్పుడు మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం “గుండెల్లో గోదారి” చిత్రం కూడా తమిళం లో నిర్మించబడుతుంది. ఈ చిత్ర తమిళ భాగానికి “మరందేన్ మన్నితేన్” అనే పేరుని ఖరారు చేశారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఆది పినిశెట్టి, తాప్సీ,లక్ష్మి మంచు,సందీప్ కిషన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1986 లో వచ్చిన వరదల నేఫధ్యంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. అటు నటన ఇటు నిర్మాణం రెండింటిని చూసుకోడానికి లక్ష్మి హైదరాబాద్,చెన్నై మరియు రాజమండ్రి ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు ప్రస్తుతం చెన్నైలో సంగీత చర్చలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు