గుండెల్లో గోదారి అవుట్ డోర్ షెడ్యూల్ పూర్తి

గుండెల్లో గోదారి అవుట్ డోర్ షెడ్యూల్ పూర్తి

Published on Apr 25, 2012 2:10 PM IST


1986 లో గోదావరి జిల్లాల్లో వచ్చిన వరదల నేపధ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘గుండెల్లో గోదారి’ చిత్రం అవుట్ డోర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 70 మంది సభ్యులతో కూడిన ఈ చిత్ర యూనిట్ సభ్యులు గోదావరి డెల్ట ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంది. అక్కడే ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్న యూనిట్ బృందం ప్యాచ్ వర్క్ చేసే పనిలో ఉన్నారు. ఆది, మంచు లక్ష్మి, సందీప్ కిషన్, తాప్సీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా నాగేంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గుండెల్లో గోదారి చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు