రుద్రమదేవి కోసం కొత్త విలన్ ని పరిచయం చెయ్యనున్న గుణశేఖర్

Rudrama Devi Stills (8)
గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణమంతా చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ బృందంలోకి మరొక ప్రముఖ పేరు జతకలిసింది. బాలీవుడ్ నటుడు విక్రంజీత్ విర్క్ ఈ సినిమాలో మహదేవ నాయుడు పాత్రకుగానూ ఎంచుకున్నారు. మహదేవ నాయుడు రుద్రమదేవితో యుద్దానికి తలపడే యాదవ రాజులలో ఒకడు. విక్రంజీత్ విర్క్ ఇదివరకే అశుతోష్ గోవరికర్ తీసిన ‘ఖేలే హం జీ జాన్ సే’ సినిమాలో నటించాడు. ఇప్పుడు ఈ ‘రుద్రమదేవి’ అతనికి తెలుగులో మొదటి సినిమాకానుంది. మరో ముఖ్యమైన అంబదేవా అనే విలన్ పాత్రలో జయప్రకాష్ రెడ్డి నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలైంది. సినిమాలో నటిస్తున్న తారాగణమంతా ఇప్పటికే గుర్రపు స్వారీ, కత్తి యుద్దాలలోనూ కటోరమైన శిక్షణ పొందుతున్నారు. ఈ సినిమాలో అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషించగా కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నటాలియా కౌర్, అదితి చెంగప్పా, హంస నందిని, జార షా, జయప్రకాశ్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తోట తరుణి కళా దర్శకుడు. అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్. ఈ ‘రుద్రమదేవి’ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మొదటిసారిగా 3డి లో తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా. ఇందుకుగానూ జర్మన్ టెక్నిషియన్స్ పని చెయ్యనున్నారు. ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version