నాగార్జున ఈ 2013ను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రారంబించనున్నాడు. ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్, అమెరికా, మరి కొన్ని ఏరియాలలో ఈ రోజు విడుదలకానుంది. దశరధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, నయనతార, మీరా చోప్రా,ఎం.ఎస్ నారాయణ, బ్రహ్మానందం, కె.విశ్వనాధ్ తదితరులు నటించారు. ఈ సినిమా దశరధ్ స్టైల్లో సాగే మానవీయ అనుబంధాల నేపధ్యంలో నడిచే చిత్రమట. చాలా రోజులతరువాత కుటుంబకధా చిత్రం చేస్తున్న నాగార్జునపైనే అందరి కళ్ళు వున్నాయి. గత కొన్నేళ్ళుగా మన కింగ్ ‘రగడ’, ‘డమరుకం’, ‘శిరిడి సాయి’ వంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు.
ఇదివరకు దశరధ్, నాగార్జున కలిసి పనిచేసిన ‘సంతోషం’ సినిమా హిట్ కావడంతో ఈ ద్వయంనుండి ప్రేక్షకుల అంచనాలు ఎక్కువే వున్నాయి. ఈ సినిమా భారీ వసూళ్లను అయితే తప్పక రాబట్టుకుంటుంది. మిగిలిన భవిష్యత్తు చిత్ర కధను బట్టి ఆధారపడుతుంది. గత కొన్ని వారాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినీ హంగామా లేకపోవడంతో ఈ సినిమా మంచి వ్యాపారం సాదించచ్చు. డి శివ ప్రసాద్ రెడ్డి నిర్మాత. థమన్ సంగీతం అందించాడు.