సెన్సార్ పూర్తి చేసుకున్న నాగ్ ‘గ్రీకు వీరుడు’

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగ్ ‘గ్రీకు వీరుడు’

Published on Apr 22, 2013 6:40 PM IST
First Posted at 18:40 on Apr 22nd

Greeku-Veerudu

కింగ్ అక్కినేని నాగార్జున స్టైలిష్ లుక్లో కనిపించనున్న ‘గ్రీకు వీరుడు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. మే 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి దశరథ్ డైరెక్టర్. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమా కామెడీ రొమాన్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్నారై ఈవెంట్ మేనేజర్ గా మొట్ట మొదటి సారి ఇండియాకి వచ్చే పాత్రలో కనిపించనున్నాడు. నాగార్జున – దశరథ్ కాంబినేషన్లో ‘సంతోషం’ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాతో మరో సక్సెస్ ని అందుకుంటారని భావిస్తున్నారు.

తాజా వార్తలు