నేడే భారీగా విడుదల కాబోతున్న మిస్టర్ నూకయ్య

నేడే భారీగా విడుదల కాబోతున్న మిస్టర్ నూకయ్య

Published on Mar 8, 2012 8:39 AM IST


రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ మిస్టర్ నూకయ్య ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజే భారీగా విడుదల కానుంది. మనోజ్ కెరీర్లోనే అత్యదికంగా 450కి పైగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం పై యూనిట్ వర్గాలు తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ ఈ చిత్రంలో స్వయంగా ఎలాంటి డూప్ సహాయం లేకుండా వీరోచితమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు. ఈ చిత్ర క్యాప్షన్ ‘నో క్యాప్షన్ ఓన్లీ యాక్షన్’ అని ఉంది అలా అని ఓన్లీ యాక్షన్ ఏమీ ఉండదు యాక్షన్ తో పాటుగా కామెడీ కూడా ఎక్కువగానే ఉంటుంది అని దర్శకుడు చెబుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో ‘పిస్తా పిస్తా’ పాట బాగా హిట్టయి యువతలో ఈ ఆడియో పై బాగా క్రేజ్ ఏర్పడింది. అని కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.ఎస్. రావు నిర్మించారు. మనోజ్ సరసన కృతి ఖర్భంద మరియు సన ఖాన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి సంభందించిన ప్రత్యేక అప్డేట్స్ మేము మేము ఎప్పటికప్పుడు అందిస్తుంటాం.

తాజా వార్తలు