ఘనంగా ‘వీడే మన వారసుడు’ ప్రీ-రిలీజ్ వేడుక

ఘనంగా ‘వీడే మన వారసుడు’ ప్రీ-రిలీజ్ వేడుక

Published on Jul 1, 2025 1:34 AM IST

Veede Mana Vaarasudu

రమేష్ ఉప్పు (RSU) హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన ‘వీడే మన వారసుడు’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో అట్టహాసంగా జరిగింది. రమేష్ ఉప్పు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా నేటి సమాజానికి అవసరమైన సందేశాన్ని అందిస్తుంది.

ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రమేష్ ఉప్పు బహుముఖ ప్రతిభను చూసి, ఆయనను దర్శకరత్న దాసరి నారాయణరావుతో పోల్చారు.

ముఖ్య అతిథి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, రమేష్ ఉప్పు కృషిని అభినందించారు. 30 ఇయర్స్ పృథ్వి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, దర్శకులు వీఎన్ ఆదిత్య, సముద్ర, పోలీస్ ఆఫీసర్ రామావత్ తేజ, హీరో కృష్ణసాయి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

దర్శకనిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ, తమ సినిమా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తుందని, రైతుల కష్టాలను హృదయానికి హత్తుకునేలా చూపించామని తెలిపారు. జూలై 18న విడుదల కానున్న ఈ కుటుంబ కథా చిత్రాన్ని థియేటర్లలో చూడాలని ప్రేక్షకులను కోరారు. హీరోయిన్లు లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు