గత కొన్ని రోజులుగా మన లోకల్ సెన్సార్ బోర్డ్ పలు విమర్శలను ఎదుర్కుంటోంది. సెన్సార్ వారు సరిగ్గా లేరని ఒక్కొక్కరిని ఒక్కోలా ట్రీట్ చేస్తున్నారని ఫిల్మ్ మేకర్స్ సెన్సార్ వారిపై పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ విషయంపై స్పందించి సెన్సార్ బోర్డ్ పై యాక్షన్ తీసుకుంటామని అన్నారు. నిన్న వరంగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘ఈ విషయంపై సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి యాక్షన్ తీసుకుంటానని’ ఆయన అన్నారు. ఇటీవలే విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘దేనికైనా రెడీ’ మరియు ‘ఉమెన్ ఇన్ బ్రాహ్మనిజం’ సినిమాలు తీవ్రమైన సెన్సార్ అభ్యంతరాలు ఎదుర్కొన్నాయి. చివరికి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి.