మాస్ కామెడీ హీరో గోవిందా 2008 ఒక కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ‘మనీ హై తో హనీ హై’ అనే సినిమాలో సంతోష్ రాయ్ అనే వ్యక్తిని కొట్టిన కేసులో ఇరుక్కున్న గోవిందాకు 2011 లో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్నీ బాగా సీరియస్ గా తీసుకున్న కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. మేజిస్ట్రేట్ ముందు హాజరు అయిన గోవిందాకు 10 వేలు జరిమానా విధించి బెయిల్ మంజూరు చేసింది.