‘చెలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆ తర్వాత ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేసావే’, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా వచ్చి సంవత్సరం పూర్తైనా గౌతం మీనన్ ఇంకో సినిమా మొదలు పెట్టలేదు. దానికి కారణం అతను మోసం చేసాడని ఆర్ఎస్ ఇన్ఫో టైన్మెంట్ అధినేత జయరామన్ తన బ్యానర్ లో సినిమా చేస్తానని మోసం చేసాడని తనకి సినిమా చేసేంత వరకూ వేరే సినిమా చేయకూడదని కోర్టులో కేసు వేసాడు.
ఎట్టకేలకు గౌతమ్ మీనన్ ఆ కేసు నుంచి బయటపడ్డాడు. తాజాగా చెన్నై హై కోర్టు వారు గౌతమ్ మీనన్ పై ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ని కొట్టి పారేశారు. అలాగే జయరామన్ పెట్టిన కేసులో నిజం లేదని కోర్టు తేల్చి చెప్పింది. దాంతో ఇన్ని రోజులు గౌతమ్ మీనన్ భరిస్తున్న హెరాస్ మెంట్ నుంచి బయట పడ్డాడు. గౌతమ్ మీనన్ త్వరలోనే అజిత్ తో ఓ సినిమా చేయనున్నాడు.