మాచో హీరో గోపీచంద్ మే 12న రేష్మ ని వివాహం చేసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. వీరిద్దరికి డిసెంబర్ 2012లో నిశ్చితార్దం జరిగింది. రేష్మ హీరో శ్రీకాంత్ కి బందువు. ఈ వివాహన్ని చాలా గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించనున్నారని సమాచారం. దీని పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండవలసిందే. గోపీచంద్ హీరోగా చంద్ర శేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా మేలో విడుదలకు సిద్దమవుతోంది.
ఈ సందర్బంగా 123తెలుగు.కామ్ తరుపున శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాము.